Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సర్పంచ్ భర్తను చంపిన యువతి..
posted on: Jun 25, 2021 3:23PM
ఆడవాళ్లు శాంతగా ఉన్నంత సేపు శాంత మూర్తులు. ఒక సారి అదే ఆడవాళ్ళూ ఉగ్ర రూపం దాలిస్తే కాళికాదేవి అవతారు కూడా ఎత్తుతారు.. తాజాగా లైంగికంగా వేధిస్తున్న గ్రామ సర్పంచ్ భర్తను ఓ యువతి కాల్చి చంపింది.. ఘటన వివరాల్లోకి వెళితే గ్రామ సర్పంచ్ భర్త రామ్‌సరన్, సర్పంచ్ అంటే గ్రామం లోనే కాదు మన దేశంలో కూడా ఒక ఉన్నతమైన హోదా ఉంది. గ్రామంలో చాలా హుందాగా ఉండాలి. అందరికి ఆదర్శనంగా ఉండాలి. సర్పంచ్ ఎంత గౌరవంగా ఉంటాడో వాళ్లకు కుటుంబ సభ్యులు కూడా అంతే గౌరవంగా ఉండాలి. అయితే ఒక సర్పంచ్ భర్త ఆ గ్రామానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతిని గత రెండుళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. అంతే కాదు ఆమెపై భౌతిక దాడికి దిగుతూ హింసిస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా రామ్‌సరన్ అరాచకం ఎక్కువై పోయింది. నిత్యం ఆమెను వేధింపులకు గురి చేస్తుండే వాడు. దీంతో అతడి బాధ భరించలేకపోయింది ఆ యువతి. ఇంట్లో సోదరుడికి, తల్లికి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు కలిసి రామ్‌సరన్ భరతం పట్టాలని ఫిక్స్ అయ్యారు. పధకం వేశారు. పంచాయితీ చెయ్యాలంటూ ఆదివారం బాధిత యువతి సోదరుడు రామ్‌సరన్ ను ఇంటికి తీసుకొచ్చాడు. కొద్దీ సేపు అతడితో మాట్లాడాడు బాధిత యువతి సోదరుడు. ఇద్దరు మాట్లాడుతున్న సమయంలోనే యువతి రామ్‌సరన్ ను వెనక నుంచి నాటు తుపాకీతో కాల్చింది. ఆ నాటు తుపాకీ పేలగానే అక్కడ ఉన్న ఊరి జనం అంత ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే ఆ సర్పంచ్ భర్త మృతి చెందాడు. హత్య అనంతరం యువతి, ఆమె సోదరుడు.. ఫరూఖాబాద్ కు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రామ్‌సరన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతి హత్య చేసినట్లు నిర్దారించారు పోలీసులు. ఫరూఖాబాద్ లో ఉన్న యువతిని, ఆమె సోదరుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం యువతిని విచారించారు. దీంతో ఆమె జరిగిన విషయం పోలీసులకు పూసా గుచ్చినట్లు తెలిపింది. గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని. సహకరించకపోతే ఇంట్లో వాళ్ళని చంపుతా అని బెదిరిస్తున్నాడని.. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమెకు వేరే మార్గం కనిపించలేదని అందుకే హత్య చేశానని ఆ యువతీ తెలిపింది. దీంతో సదరు యువతి, ఆమె సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువతి, ఆమె సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా జలాల్పూర్ అమ్రా గ్రామంలో చోటుచేసుకుంది.


.jpg)


