Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు ఫైర్
posted on: Apr 16, 2015 1:20PM

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై గడువు కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై హైకోర్టు సీరియస్ అయింది. పదే పదే గడువు కోరుతూ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయడం సరైన పద్ధతి కాదని మండిపడింది. ఎన్నికలు మీరు నిర్వహిస్తారా? లేదా మమ్మల్ని నిర్వహించమంటారా అని ప్రశ్నించింది. పదే పదే ఇలా గడువు కోరుతున్నారని, ఇది చట్టానికి లోబడి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే ఈ ఎన్నికలను నిర్వహించాలని, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు.






