Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...త్వరలో విశాఖకు టీ-మంత్రుల బృందం! కేటీఆర్, గంటా మిలాఖత్
posted on: Mar 20, 2021 2:37PM
విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు. అవసరమైతే విశాఖ వెళ్తానంటూ ప్రకటన. కట్ చేస్తే.. మంత్రి కేటీఆర్‌తో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భేటీ. ఉక్కు పోరాటానికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. విశాఖ రావలసిందిగా కోరారు. స్పందించిన కేటీఆర్.. విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, కుదిరితే అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులతో కలిసి బృందంగా విశాఖకు వస్తామని చెప్పారని తెలుస్తోంది.
తెలంగాణ శాసన సభ సమావేశాల బ్రేక్ సమయంలో మంత్రి కేటీఆర్‌ను ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. వారి మధ్య రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కేటీఆర్‌ను కలిసి మరింత మద్దతు కోరారు గంటా. గతంలోనే ఉక్కు ఉద్యమానికి సపోర్ట్ చేసిన కేటీఆర్.. విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గంటాకు చెప్పారు.




