బంగ్లాదేష్‌లో హిందూ మహిళపై గ్యాంగ్ రేప్

posted on: Feb 24, 2026 9:13AM

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి మైనార్టీలైన హిందువులపై దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘోరం వెలుగు చూసింది. ముగ్గురు దుండగులు ఓ హిందూ మహిళను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బరిషాల్ జిల్లాలోని చందాపుర్ తాలూకాలో ఆదివారం (ఫిబ్రవరి 22)  రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

దివ్యాంగురాలైన బాధితురాలు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భజనకు వెళ్లి తిరిగొస్తుండగా.. ముగ్గురు నిందితులు ఆమెను ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం (ఫిబ్రవరి 23)ఉదయం రోడ్డు పక్కన స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి హాస్పిటల్‌కు తరలించారు.

తనను రకీబ్, సోహైల్, రస్సెల్ అనే ముగ్గురు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. తనను చిత్రహింసలకు గురిచేసి గాయపరిచినట్లు తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు భోలా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...