Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విశాఖలో న్యాయ విద్యార్థిపై గ్యాంగ్ రేప్
posted on: Nov 19, 2024 4:09PM
విశాఖపట్నంలో న్యాయవిద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగింది. నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖ పట్నం రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి న్యాయవిద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీసి న్యాయవిద్యార్థిని ఆ యువకులు కొన్ని నెలలుగా బ్లాక్ మెయిల్ చేసినట్టు సమాచారం. గత రాత్రి కూడా అవే ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. రాత్రంతా నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ జరపడంతో ఆ యువతి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. విశాఖ పోలీస్ కమిషనర్ పై అగ్రహం వ్యక్తం చేసారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని హోం మంత్రి హెచ్చరించారు. న్యాయ విద్యార్థితో సన్నిహితంగా ఉన్న యువకుడే ఈ గ్యాంగ్ రేప్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందరూ మేజర్లేనని అన్నారు.


.webp)



