పెళ్ళి కాదు... రేప్!
posted on Dec 13, 2015 9:09PM

ఒక యువతిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన ఆ వ్యక్తి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అతను అక్కడ తన స్నేహితులతో కలసి ఆమె మీద సామూహిత అత్యాచారం జరిపాడు. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ప్రాంతానికి చెందిన ఒక యువతికి మీరట్‌కి చెందిన నకుల్ అనే వ్యక్తితో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆమెని పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రేమ మైకంలో వున్న ఆమె అతనితో కలసి డెహ్రాడూన్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళింది. ఆ ప్రదేశంలో పెళ్ళి చేసుకుందామని అతను చెప్పడంతో ఆమె అక్కడకి వెళ్ళింది. అక్కడే ఆమె ఊహించనిది జరిగింది. నకుల్ అతని ఇద్దరు స్నేహితులతో కలసి ఆ యువతి మీద సామూహిత అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితులు పరారీలో వున్నారు.