హుస్సేన్ సాగర్ లోనే గణేష్ నిమజ్జనం

posted on: Sep 10, 2024 5:38PM

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి లైన్ క్లియర్ అయ్యింది. 2012లో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు యధావిధిగా హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. చివరి నిముషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం సరికాదని పేర్కొంది.

దీంతో పోలీసులు హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు నిషేధం అంటూ పెట్టిన బోర్డులు తొలగిస్తున్నారు. 2021 లో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఎకో ఫ్రెండ్లీ అంటే మట్టి గణేష్ ప్రతిమలను మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలని, మిగిలిన పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే కృత్రిమ నీటి కుంటలోనే నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు ధిక్కరణ పిటిషన్ ను చివరి నిముషంలో దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...