Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టి20 వరల్డ్ కప్ విక్టరీని చీఫ్ కోచ్ గంభీర్ ఎవరికి అంకితమిచ్చాడో తెలుసా?
posted on: Mar 9, 2026 9:14AM

టి20 వరల్డ్ కప్ విజయంతో దేశ మంతటా క్రికెట్ అభిమానులు సంబరాల్లో ముగినిపోయారు. ప్రతి ఒక్కరూ టీమ్ ఇండియా సాధించిన చారిత్రాత్మక విజయాన్ని వేనోళ్ల శ్లాఘిస్తున్నారు. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ జస్పీత్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజు సాంశన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే సెమీస్ లో అద్భుత క్యాచ్ లతో జట్టుకు విజయాన్నందించిన అక్షర్ పటేల్ ను, ఫైనల్ లో అద్భుత క్యాచ్ తో డేంజర్ మేన్ కు పెవిలియన్ దారి చూపించిన ఇషాంత్ శర్మను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే టీమ్ ఇండియా హెడ్ కోచ్ మాత్రం జట్టుగా టీమ్ ఇండియా సభ్యుల సమష్టి కృషిని ప్రశంసించారు. వ్యక్తిగత మైలు రాళ్లు సాధించిన ప్రేయర్లూ పొగిడాడు, కానీ టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీని మాత్రం ఈ టోర్నీని ఇద్దరు మాజీ దిగ్గజ క్రికెటర్లకు అంకితమిచ్చారు. ఫైనల్ లో టీమ్ ఇండియా విజయం తరువాత మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఈ విక్టరీని మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
భారత జట్టును పటిష్ఠమైన స్థితిలో ఉంచినందుకు రాహుల్ ద్రావిడ్ కు, భవిష్యత్ తారలను తీర్చిదిద్దుతున్న లక్ష్మణ్‌కు ఈ ట్రోఫీని అంకితం చేస్తున్నానన్న గంభీర్.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. ఇక కష్టకాలంలో తనకు అండగా నిలిచారంటూ.. ఐసీసీ చైర్మన్ జైషాకు కృతజ్ణతలు తెలిపాడు.






