జగన్ కు గాలి కౌంటర్.. యువభేరి కాదు కుర్చీభేరి
posted on Sep 23, 2015 4:15PM
టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ విశాఖలో యువభేరి కార్యక్రమంలో చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు గాలి జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ యువభేరి అంటూ విద్యార్ధులను మోసం చేస్తున్నారని.. అది కేవలం తన కుర్చీ కోసం చేస్తున్న భేరీ అని మండిపడ్డారు. జగన్ మాటలు నమ్మి విద్యార్ధులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు అని సూచించారు. అంతేకాదు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబుకు తెలియదు అని మాట్లాడుతున్నారు.. అసలు ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోడీని.. కేంద్రాన్ని ప్రశ్నించకుండా చంద్రబాబును అనడం సబబుకాదని అన్నారు. ఒకపక్క చంద్రబాబు ఏపీ రాష్ట్ర అభివృద్ధికి... ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అహర్నిశలు కష్టపడుతుంటే దానికి సహకరించాల్సింది పోయి ఎప్పుడూ ఏదో విమర్శ చేస్తూ అడ్డుగా నిలుస్తున్నారని ఎద్దేవ చేశారు.