పాక్‌లో అరటిపళ్లు కిలో రూ. 400...సామాన్యుడి జీవనం దుర్భరం
posted on: Feb 26, 2026 1:38PM

పాకిస్థాన్ చాలా ఏళ్లుగా తీవ్ర ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తార స్థాయికి చేరాయి. ముఖ్యంగా పళ్ల ధరలు భారీగా ఉన్నాయి. పాకిస్థాన్‌లోని పండ్ల మార్కెట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్లాగర్ పండ్ల మార్కెట్లోని ధరలను వెల్లడించాడు. భారతీయ వ్లాగర్ రిజ్వాన్ ఒక దుకాణదారుడిని పండ్ల ధర గురించి అడిగాడు. ముందుగా పాక్‌లో కిలో అరటిపళ్లు 300 నుంచి 400 పాక్ రూపాయల వరకు ఉన్నట్టు దుకాణదారుడు చెప్పాడు. అలాగే ఒక కిలో బొప్పాయి 400 పాకిస్థానీ రూపాయలని చెప్పడంతో వ్లాగర్ ఆశ్చర్యపోయాడు.
ఇక, ఆపిల్స్, ఖర్జూరాల ధరలైతే మరింత భారీగా ఉన్నాయి. ఆపిల్స్ కిలోకు 500 రూపాయలు అని చెప్పాడు. ఖర్జూరాల ధర గురించి అడిగినప్పుడు, కిలోకు 1,200 పాకిస్తానీ రూపాయలు అని చెప్పి షాకిచ్చాడు. చాలా పళ్లు కిలో లెక్కన కొనాలంటే కనీసం 300 పాక్ రూపాయలు చెల్లించాల్సిందే . ద్రవ్యోల్బణం పాక్‌లోని సాధారణ ప్రజలకు ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. పళ్లు మాత్రమే కాకుండా, పెట్రోల్, గ్యాస్ వంటి వాటి ధరలు కూడా భారీగా పెరిగిపోయియి, రోజువారీ జీవితం గడపడం సామాన్యులకు కష్టంగా మారిపోయింది.




.webp)


