అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ కన్నుమూశారు

posted on: Dec 1, 2018 12:05PM

 

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌ కన్నుమూశారు. అమెరికాకు 41వ అధ్యక్షుడుగా పనిచేసిన బుష్ 94ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. బుష్ చనిపోయినట్లు ఆయన కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడైన జార్జ్‌ డబ్ల్యు బుష్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తన తండ్రి ఇకలేరు అని చెప్పడం ఎంతగానో బాధిస్తోందని తెలిపారు. రిపబ్లికన్‌ పార్టీ నేత అయిన హెచ్ డబ్ల్యూ బుష్‌ 1989 నుంచి 1993 వరకు అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు 1981 నుంచి 1989 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. జార్జ్ హెచ్‌ డబ్ల్యూ బుష్‌ను ఎక్కువగా ‘బుష్‌ 41’, ‘జార్జ్‌ బుష్‌ సీనియర్’ అని పిలుస్తారు. బుష్‌ పెద్ద కుమారుడి పేరు కూడా జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ అయినందున ఇద్దరిని పిలవడంలో తేడా ఉండడం కోసం అలా పిలుస్తారు. బుష్‌ కుమారుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ కూడా అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...