Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆరోగ్యంపై పుకార్లు
posted on: May 19, 2014 4:46PM
.jpg)
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఆయన తీవ్ర అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటూ చికిత్స పొందుతున్నారని సోమవారం నాడు రోజులుగా పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ పుకారు సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ పుకార్లను అబ్దుల్ కలాం కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. అబ్దుల్ కలాం ప్రైవేట్ సెక్రటరీ ఆర్.కె.ప్రసాద్ పేరుమీద విడుదలైన ఈ ప్రకటన అబ్దుల్ కలాం అనారోగ్యంతో వున్నారన్న విషయాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొంది. ‘‘ఈ విషయంలో మా కార్యాలయానికి అనేక ఫోన్లు వచ్చాయి. ఇవన్నీ పుకార్లని అందరికీ స్పష్టం చేస్తున్నాం. అబ్దుల్ కలామ్ చాలా ఆరోగ్యంగా వున్నారు. ఈనెల 17న ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చారు. తన దైనందిన కార్యక్రమాలలో ఆయన నిమగ్నమై వున్నారు. ఈ పుకారు మొదట ఎవరు వ్యాపింపజేశారన్న విషయాన్ని పోలీసులు పరిశోధిస్తున్నారు. ఈ మెసేజ్‌ని మొట్టమొదట ముంబైలోని ఒక సెల్ ఫోన్ జనరేట్ చేసిందని పరిశోధనలో తెలింది. అబ్దుల్ కలాం ప్రస్తుతం అనేకమంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సోమవారం మొత్తం ఆయన ఈ ఉపన్యాస కార్యక్రమంలోనే ఉత్సాహంగా పాల్గొంటున్నారు’’ అని అబ్దుల్ కలాం ప్రైవేట్ సెక్రటరీ వివరణ ఇచ్చారు.


.jpg)
.jpg)


