టీడీపీ నేతపై వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడి
posted on: May 18, 2025 2:09PM

తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడికి పాల్పడ్డాడు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో టీడీపీ నేత రాజుపై నిన్న రాత్రి నందిగం సురేష్, అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన రాజు మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దాడి ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపి.. అనంతరం బెయిలుపై విడుదల అయ్యారు. నిన్నటి దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు టీడీపీ నేతపై దాడితో మరోసారి వార్తల్లో నిలిచారు.


.webp)



