Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అత్యంత ప్రమాదకరంగా..వైసీపీ రప్ప రప్ప ధోరణి
posted on: Jul 12, 2025 8:35PM

ఎంత పెద్ద రెడ్ బుక్ రాసిన లోకేష్ కూడా.. మేం చట్ట ప్రకారం మాత్రమే.. శిక్షిస్తామని చెబుతారు. బాబు కూడా జగన్ని జైల్లో పెట్టడం ఎంత సేపు? కానీ పెట్టాలని పెట్టడం మన అభిమతం కాదని అంటారు. ఇది ఒక రకంగా చెబితే.. ఈ తండ్రీ కొడుకులు ఒకరికొకరు తాము కూడబలుక్కుని ప్రదర్శిస్తోన్న సంస్కారం మాత్రమే కాదు.. తమ శ్రేణులను కూడా అలా బిహేవ్ చేయమని సూచించే ఒకానొక క్రమశిక్షణతో కూడిన సూచన.అదే జగన్. ఎవడో ఒక కోన్ కిస్కా కార్యకర్త రాసుకొచ్చిన రప్ప రప్ప ఫ్లెక్సీ పొరబాటున మీడియా హైలెట్ చేసింది. దీని విషయంలో పార్టీ అధినేతగా జగన్.. ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయబోమని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆయనేమన్నారూ? అయితే తప్పేంటని కామెంట్ చేశారు.
దీంతో రప్ప రప్ప ఒక అధీకృతమై పోయింది. అధినేతే రప్ప రప్ప తప్పు లేదన్నపుడు.. మనం మాత్రం ఎందుకు లైట్ తీస్కోవాలనుకున్న పేర్ని నాని వంటి నేతలు.. తమ శ్రేణులను రెచ్చగొట్టేలా మరింత దారుణంగా మాట్లాడారు. మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడేలా ఉన్నారు. ఆ మాటకొస్తే.. మీరేం చెప్పొద్దు.. చేసి చూపించమని మరింత దారుణంగా రెచ్చగొడుతున్నారు. ఇదే టీడీపీ గుడివాడలో ఒక ఫ్లెక్సీ పెట్టింది. కుప్పంలో బాబు గెలిస్తే నేనొచ్చి చెప్పులు తుడుస్తా! అన్న కోణంలో నాడు కొడాలి నాని అన్న కామెంట్లకు కౌంటర్ ఇచ్చేలా.. ఈ ఫ్లెక్సీ కనిపించింది. ఇందులో ఒక సవాలుంది. ఆ సవాలును మేం గెలిచామన్న ధోరణి కనిపిస్తోంది. కానీ జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎక్కడి వరకూ వెళ్లిపోయిందంటే.. హింసను పెట్రేగేలా ప్రేరేపిస్తోంది.
టీడీపీ నుంచి కూడా కొందరు దుందుడుకు చర్యలు చేస్తుండవచ్చు. కానీ అధినేత స్థాయిలో ఇలాంటి హింసాత్మక ధోరణిని రెచ్చగొట్టడం సమంజసం కాదన్న మాట వినిపిస్తోంది. ఇదే పేర్ని నాని.. తాను సమాచార శాఖను నిర్వహించారు. అంటే ఏ మాట వెలుగులోకి రావాలి. ఏ మాట రాకూడదు. దేనికి ప్రచారం ఎక్కువ కనిపించాలి. దేనికి కలిపించకూడదని.. ఈ సీనియర్ మాజీ మంత్రి వర్యులకు ఎంతో స్పష్టంగా తెలియాల్సి ఉంది. తెలుసు కూడా. కానీ ఇక్కడేం జరుగుతోంది. కావాలని తన కేడర్ ని రెచ్చగొడుతూ.. పది మందికి ప్రేరణనిస్తున్నారు. దీంతో ఎవరైనా చేయరాని పని చేస్తే ఇందుకు బాధ్యులెవరు? అన్నదిప్పుడు అర్ధం కాని ప్రశ్నగా తయారైంది.ఇప్పటికే అధినేత బయట అడుగు పెడితే ఎన్నేసి ప్రాణాలు పోతాయో అన్న టెన్షన్ రాజ్యమేలుతోంది. ఈ క్రమంలో ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యల కారణంగా ఇదెంతటి ప్రాణనష్టానికి దారి తీస్తుందో అన్న ఆందోళన చెలరేగుతోంది.
మొన్నటికి మొన్న కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజ్వరిల్లిన హింస ఒక గుణపాఠంగా వీరెవరూ తీసుకోవడం లేదు. పైపెచ్చు ఇలాంటి ధోరణికి పాల్పడి.. అధినేత నుంచి వీరతాళ్లు వేయించుకోవాలన్న ఉత్సుక్తతతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికి మాటలు. వచ్చే రోజుల్లో అవి చేతల్లోకి మారితే పరిస్థితేంటి? అందుకేనా జగనన్న గంజాయి బ్యాచీకి కొమ్ము కాయడం, బెట్టింగ్ రాయుళ్ల విగ్రహాల ఆవిష్కరించడం. ఏమీ అర్ధం కావడం లేదని వాపోవడం సగటు ఆంధ్రుడి వంతు అవుతోంది.అంటే జగన్ ప్రస్తుతం వెళ్తున్న ధోరణి చూస్తుంటే.. ఇప్పటి వరకూ సీమకే పరిమితమైన ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రమంతటా విస్తరించడానికి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోందని వాపోతున్న వారు లేక పోలేదు. మరి ఈ వికృత సంస్కృతి ఎక్కడికి చేరుతుందో ఆ పైవాడికే ఎరుక అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు.






