Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు... ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతోనే పోటీ
posted on: Apr 22, 2025 7:31PM

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతు పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు. స్ధానిక ఎమ్మెల్యే సంజయ్‌కి మా కంటే ఎక్కువ అనుభవం ఉందా? అని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీ పడ్డానని గుర్తు చేసుకున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలపై తాము నిరంతరం పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చామని అన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ హస్తం పార్టీలో చేరడంతో కనీసం తన సంప్రదించకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కాంగ్రెస్ అధిష్టానం జీవన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
రాష్ట్రంలో సీఎం రేవంత్ పార్టీలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని తరుచుగా ఆయన వాపోతున్నారు. వి. హనుమంత్ రావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా… జానారెడ్డి కూడా నా తర్వాత పార్టీ లో నాలుగు సంవత్సరాల తర్వాత చేరాడని, పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు పార్టీని వీడనని ఆయన తెలిపారు. నేను అసంతృప్తితోనే ఉన్నాను నా సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు కాబట్టి అసంతృప్తితోనే ఉన్నానని, 2014లో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేనొక్కడినే ఎమ్మెల్యేగా అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ అంటే నేను.. నేను అంటే కాంగ్రెస్ గా పార్టీ ని బలోపేతం చేశా అని ఆయన వెల్లడించారు. గతంలో జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యతో జీవన్ రెడ్డి మరింత మనస్తాపం చెందారు. గంగారెడ్డి హత్య చేసిన నిందితుడిని పట్టుకోవాలని రోడ్డు పై బైఠాయించారు. జీవన్‌రెడ్డి వైఖరితో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు గొయ్యి వెనుక లాగా మారింది.



.webp)


