Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ పై మాజీ మంత్రి అనిత్ అవాకులు.. పదవి పోయిందన్న ఫస్ట్రేషనేనా?
posted on: May 13, 2022 1:30PM
తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటికి పని చెప్పారు. ఈ సారి అలా ఇలా కాదు.. ఏం మాట్లాడుతున్నారో తెలిసో తెలియదో అని అంతా భావించేలా. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లేందుకు అడ్డు వచ్చిన ఆరోగ్యం.. విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రతిపక్ష నాయకులపై ఇష్టారీతిన నోరు పారేసుకోవడానికి మాత్రం అడ్డు రాలేదు.
ఇంతకీ శుక్రవారం మీడియాతో ఆయన ఏం మాట్లాడారంటే.. పవన్ కల్యాణ్ పొత్తులు ఎవరితోనో, పెళ్లిళ్లు ఎవరితోనో మాకు అవసరం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల పొత్తులు పెళ్లిళ్లతో మాకు పని లేదన్నారు. ఇంతకీ అంత ఆగ్రహం ఆయనకు ఎందుకు వచ్చిందంటే.. గడప గడపకూ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ముస్లిం మహిళలు తరిమి కొట్టారంటూ జనసేన చేసిన ఒక పోస్టు. దీంతో ఆయనకు ఎక్కడో కాలింది. దాంతో ఇంత కాలం మోహం చాటేసిన ఆయన ఒక్క సారిగా మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన చెలరేగిపోయారు.
ముస్లిం మహిళలు తనను తరిమి కొట్టారంటూ జనసేన వాళ్లు పోస్టు చేసిన వీడియో పాతదనీ, తానింత వరకూ గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొననే లేదనీ చెప్పేశారు. గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కు ఆరోగ్యం బాలేదన్న అనిల్ కుమార్ యాదవ్ ఒళ్లు మరచిపోయేంత ఆవేశంతో మీడియాతో మాట్లాడడానికి అరోగ్యం ఎలా అనుమతించిందో చెప్పలేదు.
కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన తరువాత కొద్ది రోజులు తాజా మంత్రి కాకాణిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా హడావుడి చేసిన అనీల్ కుమార్ యాదవ్.. ఆ తరువాత కారణాలేమైతేనేం.. మౌనవ్రతం పూనారు. దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పడు హఠాత్తుగా తెరమీదకు వచ్చి జనసేనానిపై అవాకులతో చెలరేగిపోయారు. పనిలో పనిగా ప్రతిపాదనలో ఉన్న తెలుగుదేశం, జనసేన పొత్తులపై కూడా విమర్శలు గుప్పించేశారు.
సంక్షేమ పథకాలతో జగన్ కు ప్రజా మద్దతు అంతకంతకూ పెరుగుతుండటం చూసి భయం పట్టుకునే వాళ్లు కలిసి పోటీ చేద్దామనుకుంటున్నారన్నారు. జనసేన బీజేపీకి తొత్తు అని చెప్పిన అనీల్ కుమార్ యాదవ్ అలాంటి జనసేన తెలుగుదేశంతో కలిసి ముస్లింలను వైసీపీకి దూరం చేయాలని కలలు కంటోందన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల వయస్సులపై కూడా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. యూట్యూబుల్లో ఇష్టారీతిన పోస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు.
తాను కామ్ గా ఉన్నా తన అభిమానులు ఊరుకోరన్నారు. అనుచిత వ్యాఖ్యలతో అనీల్ రెచ్చిపోవడానికి కారణం మంత్రిపదవి పోయిందన్న ఫ్రస్ట్రేషనే కావచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమం అయిన గడప గడపకూ ప్రభుత్వం కు దూరంగా ఉండటంతోనే వైసీపీలో ఆయన పనైపోయిందని అర్ధమౌతోందని జనసేన వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి.


.webp)



