మాజీ డిజిపి బంధువు ఇంట్లో భారీ చోరీ

posted on: Jul 8, 2015 7:09AM

 

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నివాసముంటున్న మాజీ డిజిపి దినేష్ రెడ్డి దగ్గర బంధువు ఇంట్లో నిన్న రాత్రి దొంగలు పడి సుమారు కోటి రూపాయల విలువైన బంగారం, ఇతర ఆభరణాలు, విలువయిన వస్తువులను అపహరించుకుపోయారు. ఇంట్లోవారు బందువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఈ దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లో అంత విలువయిన ఆభరణాలను ఎందుకు ఉంచుకొన్నారో తెలియదు కానీ వాటి గురించి తెలిసిన వ్యక్తులే ఎవరో ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పిర్యాదు అందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...