ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెన్షన్ గడువు పొడిగింపు

posted on: Feb 22, 2026 2:37PM

 

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను జూన్ 30 వరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు పూర్తవడం లేదా  పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటివరకు కొనసాగనున్న సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలతో ఆయన కేసు నమోదైన విషయం తెలిసిందే. 

అలాగే అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలున్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ & అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3(3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన క్రైమ్ నం.187/2024 దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో సంబంధం ఉండటంతో సస్పెన్షన్‌ను పొడిగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...