కన్యత్వ పరీక్ష చేయిస్తే రేప్ కేసే

posted on: Feb 7, 2019 11:39AM

 

మహారాష్ట్ర హోంశాఖ మంత్రి రంజిత్ పాటిల్ సంచలన ప్రకటన చేశారు. కన్యత్వ పరీక్ష  చేయించిన వారిపై అత్యాచారం కేసు నమోదు చేసేలా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తానని రంజిత్ పాటిల్ ప్రకటించారు. ఎవరైనా మహిళలకు బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేయిస్తే.. అత్యాచారం కేసుగా పరిగణించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 'కన్యత్వ పరీక్షలు నిర్వహించడాన్ని లైంగిక దాడిగా పరిగణించాల్సి ఉంటుంది. లా&జ్యుడిషియరీ శాఖల అధికారులతో మాట్లాడిన తర్వాత దీన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నాం.' అన్నారు.

సామాజికవేత్తలతో కూడిన ఓ ప్రతినిధి బృందం ముంబైలో మంత్రిని కలిసి ఈ మేర ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి.. హోంశాఖ డిప్యూటీ సెక్రటరీని ఆదేశించారు. కంజర్ భట్ కులంలో కొందరు 22 మంది మహిళలకు కన్యత్వ పరీక్షలు చేయించారని, దీనిపై చర్యలు తీసుకొని, భవిష్యత్ లో ఇలాంటి కన్యత్వ పరీక్షలు చేయించకుండా చర్యలు తీసుకోవాలని శివసేన ఎమ్మెల్సీ నీలం ప్రతినిధి బృందంతో మంత్రిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలోని కంజర్‌భట్ కమ్యూనిటీలో ఇప్పటికీ కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తుండటంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కన్యత్వ పరీక్షలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...