TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం

Published on: Thu Jun 12, 2025 2:31PM

అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణీకులతో అహ్మదాబాద్ నుంచి లండన్ వెడుతున్న ఎయిర్ ఇండియా   787 విమానం టేకాఫ్ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూ లిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  

కాగా విమానంలో ఉన్న ప్రయాణీకులు సురక్షితమేనని అంటున్నారు. ప్రయాణీకులను ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ, హోమంత్రి అమిత్ షా ప్రమాద వివరాలను గురించి ఆరా తీశారు. ప్రయాణీకుల క్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.   వారికి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాద కారణాలేమిటన్నది విచారణ అనంతరం మాత్రమే తెలిసే అవకాశం ఉంది.