Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మిథున్ రెడ్డి అరెస్ట్.. పెద్దిరెడ్డికి తొలి ఎదురుదెబ్బ
posted on: Jul 19, 2025 9:52PM
.webp)
వైసీపీ కీలక నేత, పుంగనూరు ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి గట్టి షాక్ తగిలింది. జిల్లాలో కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీ లో తిరుగులేని నేతగా రాజకీయం నడిపిన పెద్దిరెడ్డికి తొలి సారిగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్దరెడ్డి తనయుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ శనివారం (జులై 19) అరెస్టు చేసింది. ఇది ఏ రకంగా చూసుకున్నా పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురు దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది.
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తొలినుండి చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మధ్య ఉప్పు నిప్పులా నడుస్తుంది. విద్యార్థి దశలోనే ఇరువురు నేతలు ప్రత్యర్థులుగా తలపడ్డారు. అనేక సంద ర్భాల్లో చంద్రబాబు ను రాజకీయంగా దెబ్బ తీయడానికి రామచంద్రా రెడ్డి విఫలయత్నం చేశారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికి వైఎస్ తో ఉన్న విభేదాలతో రామచంద్రారెడ్డి మంత్రి పదవిని దక్కించుకోలేక పోయారు. 2009 నాటికి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బెంగళూరులోనే ఉంటూ జగన్ కు దగ్గరయ్యారు. దీంతో పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి వైఎస్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అప్పటి నుంచి జగన్, మిథున్ రెడ్డి బంధం మరింత బలపడింది. ఆ తరవాత జరిగిన పరిణామాలలో చిత్తూరు జిల్లాలో అప్పటి వరకు వైఎస్ వర్గీయులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తదితరులను జగన్ దూరం పెట్టడం ప్రారంభించారు. జగన్ పార్టీకి సంబంధించి తొలి నుంచీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా కొనసాగింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంటే.. 2019 నుంచి రాయలసీమలో పెద్దిరెడ్డి కింగ్ మేకర్ అయ్యారు. మరోవైపు మిథున్ కూడా జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరించారు.
2019-24 మధ్య జగన్ క్యాబినెట్ లో పెద్దిరెడ్డి నంబర్ టూ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పం లో చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి రాజకీయాలు చేశారు. ఓ వైపు జగన్ కు సంబంధించిన కీలక వ్యవహారాలను మిథున్ రెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకంగా మారారు. నమ్మిన బంటుగా మిథున్ రెడ్డిని ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డికి ప్రత్యా మ్నాయంగా జగన్ ప్రోత్సహించారు. జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి ఏమి చేసినా రైట్ అన్నట్లుగా జగన్ పెత్తనమంతా పెద్దిరెడ్డి చేతిలో పెట్టారు.
జగన్ అధికారంలో ఉన్నంత వరకూ పెద్దిరెడ్డి మాటే శాసనం అన్నట్లుగా చిత్తూరు వైసీపీ రాజకీయం నడిచింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి భూక్జాల నుంచి దౌర్జన్యాల వరకూ చేయని అరాచకం అంటూ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే జగన్ అధికారం కోల్పోయి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో.. అ అప్పటి నుంచే పెద్దిరెడ్డికి అన్ని వైపుల నుంచీ ప్రతికూలత ఎదురైంది. ఇక ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుతో పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తనయుడి అరెస్ట్ తో రామచంద్రారెడ్డి కుంగిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.1978 నుంచి రాజకీయాల్లో ఉన్న రామచం ద్రారెడ్డి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ లాంటి బలమైన నాయకులను కూడా దీటుగా ఎదుర్కొన్నారు. చంద్రబాబుతో కూడా ఢీ అంటే ఢీ అంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మిధున్ రెడ్డి అరెస్టుతో పుంగనూరు పుడింగికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు.


.webp)



