అయోధ్య హనుమాన్ గుడిలో కాల్పులు

posted on: Jul 22, 2013 4:34PM

 

Firing in Hanumangarhi temple, Ayodhya Hanumangarhi temple

 

 

వివాదాస్పద రామ జన్మభూమి - బాబ్రీ మసీదుకు సమీపంలోని హనుమాన్ గుడి ఆలయంలో ఆదివారం కాల్పులు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహంతులకు చెందిన రెండు ముఠాల మధ్య వివాదమే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది.

 

హనుమాన్ గుడి ఆలయానికి చెందిన మహంత్ భవనాథ్ దాస్ ఆధ్వర్యంలో ముఠాకు, మహంత్ హరిశంకర్ దాస్ నేతృత్వంలోని ముఠాకి మధ్య.. భక్తుల నుంచి స్వీకరించిన ఆస్తులు, సంపద పైన ఆధిపత్యం విషయమై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోందని తెలుస్తోంది. రెండు వైపుల నుంచి కాల్పులకు సంబంధించి లిఖిత పూర్వక ఫిర్యాదులు అందాయని, ప్రస్తుతం ఎప్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...