Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహా కుంభమేళాలో ఫైర్ యాక్సిడెంట్
posted on: Jan 30, 2025 3:29PM
.webp)
మహాకుంభమేళాను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒకసారి భారీ అగ్నిప్రమాదం సంభవించి పెద్ద సంఖ్యలో గుడారాలు కాలిపోయాయి. ఆ తరువాత బుధవారం (జనవరి 29)తెల్లవారు జామున తొక్కిసలాట జరిగి 30 మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే తాజాగా గురువారం (జనవరి 30) ప్రయాగ్ రాజ్ సెక్టార్ 22లో ఛట్నాగ్ ఘాట్ వద్ద అగ్రిప్రమాదం సంభవించింది.
ఈ అగ్నిప్రమాదంలో 15 గుడారాలు కాలి బూడిదయ్యాయి. గ్యాస్ సిలెండర్లు పేలడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రాణాపాయం సంభవించలేదని అధికారులు తెలిపారు. మహాకుంభమేళాలో వరుస ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. రానున్న రోజులలో మహాకుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగనుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో భక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. యూపీ సర్కార్ కుంభమేళా సందర్భంగా మరింత కట్టుదిట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.



.webp)


