బాచుపల్లిలో ఫైర్ యాక్సిడెంట్.. రూ.5 కోట్ల ఆస్తినష్టం

posted on: Mar 4, 2026 11:48AM

హైదరాబాద్ లో  మంగళవారం (మార్చి 3) రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రూ. 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించింది.  మియాపూర్, బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

ముందుగా ఓ దుకాణంలో మొదలైన మంటలు  క్షణాల్లోనే పక్కనున్న షాపులకు  వ్యాపించాయి. దుకాణాల్లో కలప, ఫర్నిచర్, ఫోమ్ వంటివి ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. అలాగే   కొన్ని దుకాణాల్లో  ఉన్న వంట గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందిమంటలను అదుపు చేశారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.   బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...