Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్ గాంధీ కొకైన్ వాడతారన్న సుబ్రమణ్యస్వామి...కాంగ్రెస్ సీరియస్
posted on: Jul 8, 2019 10:36AM
.jpg)
వివాదాలకు వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈ సారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ డ్రగ్స్ తీసుకుంటారని ఆయన చెప్పారు. అదికూడా కొకైన్ మాత్రమే వాడుతారని చెప్పారు. దీంతో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాహుల్ గాంధీ కొకైన్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటారని కొత్వాలి నగర్ లో సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. రాహుల్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. చత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు పతల్గావ్ పోలీస్ స్టేషన్‌లో సుబ్రహ్మణ్య స్వామిపై కేసు నమోదైంది.
ఐపీసీ-504, 505, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. రాహుల్‌పై తప్పుడు అభియోగం చేస్తున్నానన్న విషయం సుబ్రహ్మణ్య స్వామికీ తెలుసునిమ, తెలిసినా ఆ ఆరోపణలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలతో పార్టీల మధ్య అనవసరంగా అగాధం ఏర్పడుతుందని, వైషమ్యాలు పెరుగుతాయని, తద్వారా ప్రజలను రెచ్చగొట్టినట్లు అవుతుందన్న సంగతీ స్వామికి తెలుసునని ఆయన తెలిపారు. దీని వల్ల ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల్లో విబేధాలు సృష్టించినట్లే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వాఖ్యల వల్ల సమాజ శాంతికి విఘాతం కలుగుతుందని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.






