TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్థిక ఉగ్రవాది జగన్.. పయ్యావుల కేశవ్

Published on: Fri Nov 15, 2024 1:13PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు.  శాసనసభలో బడ్జెట్‌పై  ప్రసంగించిన ఆయన ఆర్థిక ఉగ్రవాది గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారన్నారు.  రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నానా కష్టాలు పడుతున్నామన్న పయ్యావుల అసలు గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో కూడా అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. దేనికీ లెక్కాపత్రం లేదన్నారు.

అంకెల గారడీతో జగన్ సర్కార్ అన్ని వ్యవస్థలనూ అస్తవ్యస్తం చేసేసిందని విమర్శించారు.  జగన్ హయాంలో రాష్ట్రంలో ఈ  ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ అరాచకం జరిగిందని పేర్కొన్నారు. చట్ట సభల అనుమతి లేకుండా రూ. 634 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ చెప్పిందని పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా  గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు.  ఆర్థిక ఉగ్రవాది జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం అన్ని రంగాలలో కుదేలైందని, కూటమి ప్రభుత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని పయ్యావుల కేశవ్ అన్నారు.