పార్లమెంటు భవన్ కు చేరుకున్న విత్తమంత్రి

posted on: Feb 1, 2025 9:16AM

కేంద్ర విత్తమంత్రి  నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈరోజు వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశట్టేందుకు పార్లమెంట్ భవన్ కు చేరుకున్నారు. చక్కగా ఎంబ్రాయిడరీ చేసిన బంగారు అంచు ఉన్న క్రీమ్ కలర్ హ్యాండ్లూమ్ సిల్క్ చీర ధరించారు.  ఆమె ఈ ఉదయం నుంచీ పలువురు అధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆమె చేతిలో బంగారు వర్ణంలో ఉన్న జాతీయ చిహ్నంతో కూడిన ఎర్ర కవర్ ఉంది.

ఆందులోనే బడ్జెట్ పొందుపరిచిన టాబ్ ఉంది. ఆ టాబ్ ద్వారానే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. అంతకు ముందు ఆమె రాష్ట్రపతి భవన్ లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కూడా ఉన్నారు. ముర్ముతో భేటీ అనంతరం ఆమె పార్లమెంటు భవన్ కు చేరుకున్నారు. అక్కడ కేబినెట్ బడ్జెట్ ను ఆమోదించిన అనంతరం నిర్మలా సీతారామన్ దానిని లోక్ సభలో ప్రవేశ పెడతారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...