వివాదాలలో తెలుగు సినిమాలు నిదరోతున్న సెన్...సార్లు

 

చిత్ర పరిశ్రమకి వివాదాలు కొత్త కాకపోయినప్పటికీ, ఇటీవల అవి కొంచెం ఎక్కువవుతున్నాయి. కొద్ది కాలం క్రితం విడుదలయిన ‘అయ్యారే’ ‘విమన్ ఇన్ బ్రాహ్మనిజం’ ‘దేనికయినా రెడీ’ ‘కెమెరామాన్ గంగతో రాంబాబు’ మొదలయినవి చాలానే ఉన్నాయి.

 

కమల్ హస్సన్ నటించి దర్శకత్వం వహించిన విశ్వరూపం వివాదం ముగిసింది. ఈ నెల 11న విడుదలకావలసిన ‘విశ్వరూపం’ సినిమా ఇదే నెల 25కి వాయిదా పడగా, టీవీ సెట్లలో డీటీహెచ్ ద్వారా వచ్చే నెల 2వ తేది ఒక్క రోజు మాత్రమే ప్రదర్శింపబడుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన కమల్ హస్సన్, ఇన్ని సమస్యలు ఎదురవడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ, అన్ని కోట్లు ఖర్చుచేసి నిర్మించుకొన్న తన చిత్రాన్ని తనకిష్టమయిన విదంగా విడుదలచేసుకోలేక పోయినందుకు బాధ పడిన కమల్ హస్సన్, సినిమా విడుదలచేసుకోవడంలో తన హక్కులకి భంగం కలిగిందంటూ రేగులేటరీ కమీషన్లో పిర్యాదు చేయడంతో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

 

ఇప్పుడు కొత్తగా, రామ్ చరణ్ నటించిన ‘నాయక్ సినిమా వివాదంలో చిక్కుకోంది. విశాఖకు చెందిన వైయస్సర్సీ పార్టీ పరవాడ శాసనసభ్యుడు గండి బాబ్జీ ఆ సినిమాలో విలన్ పాత్రకు తన పేరు పెట్టడానికి అభ్యంతరం తెలుపుతూ మొదట దర్శకుడు వి.వి.వినాయక్ తో మాట్లాడారు. వారంలోగా ఆ పేరు మార్పు జేస్తామని హామీ ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయకపోవడంతో నిన్న విశాఖలోని పెందుర్తి పోలీసు స్టేషన్లో నాయక్ సినిమా దర్శకుడు, నిర్మాత, మరియు చిత్ర సమర్పకుల మీద ఆయన పిర్యాదు చేసారు.

 

ఒక బాధ్యతాయుతమయిన, గౌరవనీయమయిన శాసనసభ్యుడయిన తన పేరును ఆ చిత్రంలో విలన్ కి పెట్టడం ద్వారా సమాజంలో తన గౌరవప్రతిష్టలకు భంగం వాట్టిలుతోందని అయన అన్నారు. సినిమాలో తన పేరున్న విలన్ హత్యలు, కిడ్నాపులు, భూదందాలు, సెట్టిల్మెంట్స్ వంటి సంఘ వ్యతిరేఖ కార్యక్రమాలు చేయడంవల్ల, ఆ పాత్ర తననుదేశ్యించి తీసినదేనని ప్రజలు చెవులు కోరుకొంటున్నారని ఆయన బాధపడుతూ వెంటనే రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శను నిలిపివేయాలని పోలీసులను కోరారు. ఇప్పటికయినా వెంటనే తన పేరును సినిమాలోంచి తొలగించకపోతే, దర్శక నిర్మాతలపై పరువునష్టం దావా వేస్తానని గండి బాబ్జీ హెచ్చరించారు.

 

అయితే, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమాలో మార్పులు చేయడం కష్టమేనని సాంకేతిక నిపుణులు అంటున్నారు. రాజకీయ నేపద్యం కల్గిన మన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏవిదంగా సర్టిఫికేట్ ఇచ్చేసారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. వారే గనుక మొదటే అభ్యంతరం వ్యక్తం చేసినట్లయితే, ఇటువంటి తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఉండేది. గానీ, వారు బాధ్యాతా రహితంగా వ్యహరిస్తూ సినీ పరిశ్రమ వివాదాలలో చిక్కుకోనేందుకు వారే ప్రధాన కారణం అవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వారే గనుక, తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తే, ఇన్ని వివాదాలకు తావుండేదేకాదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.