పూరీ ఇంట్లో చోరీ

posted on: Mar 14, 2015 6:57AM

 

కారెవరూ దోపిడీకి అనర్హులు అనుకొన్నారో ఏమో తెలియదు గానీ దొంగలు దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇంటిని కూడా  వదిలిపెట్టలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు ఆయన ఇంతలో జొరబడి అందినకాడికి దోచుకొని వెళ్ళిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో ఉన్న ఆయన ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు ప్రవేశించి బెడ్ రూమ్ లో ఉన్న బీరువాలో ఉన్న సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, అరుదైన వజ్రాలు పొదిగిన ఒక నెక్లెస్ ఎత్తుకుపోయారు. ఈ విషయం తెలుసుకొన్న పూరీ జగన్నాథ్ అదే రోజు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...