ఆత్మహత్య చేసుకొన్న దర్శకుడు

 

రంగురంగుల సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలుకానివారు ఎల్లపుడూ ఉంటూనే ఉన్నారు. కానీ వారిలో ఏకొద్దిమంది కలలు మాత్రమే సాకారం అవుతాయి. మిగిలిన వారికి జీవితాంతం నిరాశ, నిస్ప్ప్రుహలు, ఆర్ధిక సమస్యలు వెన్నాడుతూనే ఉంటాయి. అవి తట్టుకోలేనివారు అర్ధంతరంగా జీవితం ముగించి తమ కుటుంబ సభ్యులను, మందు మిత్రులను విషాదంలో ముంచి వెళ్ళిపోతారు.

 

ఇటీవలే సినీరంగంలో అడుగుపెట్టిన జగదీశ్ (40) అనే యువదర్శక నిర్మాత, ఆర్ధిక సమస్యల కారణంగా శనివారం మధ్యాహ్నం వైజాగ్ సింహపురి కాలనీ సమీపంలో ఒక విద్యుత్ స్తంభానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన ఐదు రోజుల క్రితమే విజగ్ లో తన మొట్ట మొదటి సినిమా ‘బూచోడు’ షూటింగ్ ప్రారంభించారు. దానిని స్వీయ దర్శకత్వంలో ఆయనే నిర్మిస్తున్నారు. అన్ని సమకూర్చుకొని సినిమా అయితే మొదలుపెట్టగాలిగారు కానీ, అది ఆర్ధికంగా పెనుభారం అవడంతో అప్పులపాలయ్యారు. బహుశః ఆ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జగదీశ్ కి భార్య, ఇంజినీరింగ్, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.