Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫాల్–2020 అకడమిక్ ఇయర్ స్ప్రింగ్ 2021కి వాయిదా?
posted on: Apr 13, 2020 12:04PM
కరోనా ఎఫెక్ట్ తో అమెరికన్ విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు వాయిదా వేసే యోచనలో వున్నాయి. అమెరికాలో విశ్వవిద్యాలయాలు ఎప్పుడు పని చేస్తాయన్నది చెప్పడం కష్టమేనని, ఒకవేళ ఆగస్టు నాటికి మామూలు పరిస్థితులు నెలకొన్నా ఫాల్–2020 తరగతులు సెప్టెంబర్‌లో ప్రారంభం కావడం గగనమేనని యూనివర్సిటీ అఫ్ ఫ్లోరిడా గ్యాన్‌విల్లే అకడమిక్ విభాగం పేర్కొంది.
‘మీకు ఇచ్చిన అడ్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. మీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు పూర్తయి మార్కుల జాబితా రాగానే మాకు పంపండి. ఫాల్ వీలు కాకపోతే స్ప్రింగ్–2021కి మీ అడ్మిషన్‌ను వాయిదా వేస్తాం’అని విద్యార్థులకు పంపిన కమ్యూనికేషన్‌లో స్పష్టం చేసింది. ‘యూనివర్సిటీ అఫ్ ఆరిజోనా.
ఈ ఏడాది ఫాల్–2020 అకడమిక్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన అడ్మిషన్లు రద్దు కావు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఆందోళన అవసరం లేదు. కచ్చితంగా వారికి తదుపరి అకడమిక్ సెమిస్టర్‌లలో అవకాశాలు ఇస్తారని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్, షికాగో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రణవ్ బోన్సులే అన్నారు.
ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసిన నాలుగో ఏడాదిలో ఉన్న విద్యార్థులు దాదాపు 40 వేల మంది ఫాల్–2020కి అడ్మిషన్లు పొందారు. షెడ్యూల్ ప్రకారం మరో 30 నుంచి 40 వేల మందికి ఈ నెలాఖరుకు అడ్మిషన్లు రావాలి. కానీ, అక్కడ 90 శాతం విశ్వవిద్యాలయాలు కరోనా వైరస్ కారణంగా పని చేయడం లేదు. ఈ వర్సిటీలు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో, అడ్మిషన్లు ఎప్పుడు ఇస్తారో అనే దానిపై స్పష్టత లేదు.
‘జూన్ నాటికి మామూలు పరిస్థితులు నెలకొని జూలైలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినా వారు ఫాల్ –2020కి హాజరు కావడం గగనం. ఒకసారి విద్యార్థి ఐ20 అందుకున్న తరువాత వీసా అపాయింట్‌మెంట్‌కు ఆరు వారాలు పడుతుంది. ప్రస్తుత తరుణంలో అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన 40 వేల మంది మే మొదటి వారంలోగా వీసా అపాయింట్‌మెంట్ తీసుకుని ఉండాల్సింది. కాన్సులేట్లు మూసి ఉన్న కారణంగా అది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందువల్ల ఫాల్–2020 అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగే’ అవకాశం లేదు.
మే 15 దాకా కాన్సులేట్‌లు తెరుచుకోవడం అనుమానమే.. ‘కచ్చితంగా ఫలానా సమయంలో పని చేస్తాయని చెప్పలేం. కానీ, మాకు అందుతున్న సమాచారం ప్రకారం మే 15 దాకా పని చేయవు’అని కాన్సులేట్ వర్గాలు అంటున్నాయి.
ఇదే జరిగితే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన 40 వేల మందికి జూలై, ఆగస్టులో గానీ అపాయింట్‌మెంట్లు పొందే అవకాశం లేదు. ఒక సారి కాన్సులేట్ పని చేయడం మొదలుపెడితే ఏప్రిల్ 15 నాటికి వీసా అపాయింట్‌మెంట్ కలిగి ఉన్న వారికే (ప్రస్తుతం రద్దయ్యాయి) జూన్ చివరి దాకా రీషెడ్యూల్ అవుతాయి. అందువల్ల కొత్త అపాయింట్‌మెంట్లకు అవకాశం ఉండకపోవచ్చు.






