TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దొంగబాబా:భక్తి పేరిట మహిళలపై అత్యాచారాలు

Published on: Tue Jul 5, 2016 12:24PM

దేశంలో రోజు రోజుకొక దొంగ బాబా లీలలు వెలుగులోకి వస్తున్నా జనాలు గొర్రెల మందల్లా బాబాల భజనను వదలడం లేదు. తాజాగా జైపూర్‌లో మరో దొంగ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. రజనీశ్ గ్రోవర్ అలియాస్ అశోక్ కుమార్ అనే వ్యక్తి బాబా అవతారమెత్తాడు. అంతే నాలుగు కమ్మని మాటలు చెప్పేసరికి పిచ్చి భక్తులు మైమరచిపోయారు. అలా నమ్మి తన దగ్గరకు వచ్చిన మహిళా భక్తురాళ్లకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా విషయం బయటకు రాకుండా వారు నగ్నంగా ఉన్న ఫోటోలను తీసి బెదిరించేవాడు. అలా ఆ దొంగ బాబా ఆకృత్యాలకు ఎందరో అమాయక మహిళలు బలైపోయారు.

 

పాపం పండనిదే దేవుడు కూడా ఏం చేయనట్లే..మనోడి పాపం పండే రోజు రానే వచ్చింది. ఒక కొత్త షాపు ప్రారంభించిన బాబా భక్తురాలు ఆయనగారి ఆశీస్సుల కోసం బాబాను ఇంటికి ఆహ్వానించింది. అక్కడ పూజలు చేసిన బాబా ప్రసాదంలో మత్తు మందు కలిపిన బిస్కట్లను ఆమెతో పాటు ఆమె తల్లికి ఇచ్చాడు. వారు మత్తులోకి వెళ్లగానే ఇద్దరిపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు.

 

అంతేకాకుండా మైకంలో ఉన్న తల్లీకూతుళ్లకు సంబంధించిన నగ్న ఫోటోలను తీశాడు. మత్తు నుంచి తేరుకున్న తర్వాత ఇదేమిటని నిలదీశారు. గుట్టురట్టు చేస్తే మీ ఫోటోలు బయటపెడతానని హెచ్చరించాడు. ఆ మహిళ బలవంతంగా బాబా దగ్గరి స్మార్ట్‌ఫోన్‌ను ఎలాగోలా చేజిక్కించుకుంది. అందులో ఫోటో గ్యాలరీ ఓపెన్ చేయగానే ఖంగుతింది. ఎందుకంటే దానిలో వారితో పాటు ఇతర మహిళలకు సంబంధించిన అనేక నగ్నచిత్రాలు ఉన్నాయి. బాధిత మహిళ వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో బాబాగారి లీలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు సదరు దొంగబాబాను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు.