Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నడిరోడ్డుపై నరికి చంపేశారు
posted on: Sep 1, 2012 9:43AM
రాయలసీమ ముఠాకక్షలు షాద్‌నగర్ శివార్లలో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మృతులలో ఒకరు అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల౦ కృష్ణాపురంవాసి మల్లికార్జున్‌గా, మరొకతన్ని తాడిపత్రికి చెందిన లింగుట్ల ప్రసాద్‌గా గుర్తించారు. షాద్‌నగర్ శివారులోని ఓ డాబా వద్ద మరో ఇద్దరితో కలిసి టీ తాగుతుండగా వాహనాలపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఇద్దరిపై దాడి చేసి హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పాత కక్షలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిరుడు నవంబర్ 12వ తేదీన జరిగిన వెంకట్రామారెడ్డి హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.






