Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహారాష్ట్రలో మళ్లీ కమలానిదే అధికారం... కనీసం పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్...
posted on: Oct 22, 2019 11:42AM

మహారాష్ట్రలో వార్ వన్ సైడ్ అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మరాఠా గడ్డపై కమలానిదే మళ్లీ అధికారమని బల్లగుద్దిమరీ చెప్పాయి. బీజేపీ, శివసేన కూటమికి ఎదురే లేదని తేలింది. తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. అంతేకాదు కాంగ్రెస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిందని, మునుపటి కంటే మరింత దారుణ ఫలితాలు రావడం ఖాయమని తేల్చేశాయి. కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పతనమైందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక, ఎన్సీపీయే ఎంతోకొంత పరువు నిలబెట్టుకుందని లెక్కగట్టాయి.
మహారాష్ట్రలో ఈసారి కూడా బీజేపీ హవానే కొనసాగుతుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. బీజేపీ 166 స్థానాల నుంచి 194 వరకు గెలుచుకుంటుందని తెలిపింది. ఇక, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి 72 నుంచి 90 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని... ఇతరులకు 22 నుంచి 34 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 48 సీట్లు, ఇతరులకు 10 స్థానాలు దక్కుతాయని టైమ్స్ నౌ ఎగ్గిజ్ పోల్స్ వెల్లడించాయి. అలాగే, బీజేపీ కూటమి 230 స్థానాలు, కాంగ్రెస్ మిత్రపక్షాలు 48 సీట్లు, ఇతరులకు 10 స్థానాల వరకు రావచ్చని ఇండియాటీవీ ఎగ్జిట్ పోల్ లెక్కగట్టింది. అదేవిధంగా బీజేపీ కూటమి 204 సీట్ల వరకు గెలుచుకుంటుందని ఏబీపీ న్యూస్ అంచనా వేసింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు 69 స్థానాలు, ఇతరులకు 15 సీట్లు దక్కే అవకాశం ఉందని ఏబీపీ సర్వే వెల్లడించింది.
ఇక రిపబ్లిక్ టీవీ అయితే బీజేపీకి 230 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే కాంగ్రెస్‌కు 43, ఇతరులకు పది దక్కుతాయని రిపబ్లిక్ టీవీ తెలిపింది. మొత్తానికి అన్ని జాతీయ ఛానెళ్లు, సర్వే సంస్థలు మరో అభిప్రాయానికి తావులేకుండా మహారాష్ట్రలో బీజేపీ-శివసేనదే విజయమని తేల్చేశాయి. అయితే, గత ఎన్నికల్లోనూ చాలా ఎగ్జిట్‌పోల్స్ లెక్క తప్పాయి. పూర్తిగా రివర్సయిన సందర్భాలూ ఉన్నాయి. మరి, ఈ ఎగ్జిట్ పల్స్... ఏ మేరకు నిజమవుతాయో ఈనెల 24న తేలిపోనుంది.
వివిధ ఛానెల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలు
TIMES NOW : బీజేపీ - 230, కాంగ్రెస్ - 48, ఇతరులు - 10
REPUBLIC : బీజేపీ 135 - 142, శివసేన 81 - 88, కాంగ్రెస్ 24 - 30
INDIA TODAY : బీజేపీ 166-194, కాంగ్రెస్ 72 - 90, ఇతరులు 22 - 34
NDTV : బీజేపీ - 211, కాంగ్రెస్ - 64, ఇతరులు - 13
ABP : బీజేపీ - 204, కాంగ్రెస్ - 69, ఇతరులు - 15
INDIA TV : బీజేపీ - 230, కాంగ్రెస్ - 48, ఇతరులు - 10
NEW X : బీజేపీ 188 - 200, కాంగ్రెస్ 74 - 89, ఇతరులు 6 -10






