టీడీపీకి మరో నేత షాక్.. బీజేపీలోకి కాదు వైసీపీలోకి!

posted on: Jul 7, 2019 11:19AM

 

ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవ్వడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరారు. మరికొందరు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీని వీడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన బీజేపీలోకి కాకుండా రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం.

ఆయన ఎవరో కాదు.. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరావు. ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన తన అనుచరులు, కార్యకర్తలు, సన్నిహితులతో మంతనాలు జరిపారట. వైసీపీలో చేరికపై ఆయన రేపు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం టికెట్ ను ఆయన ఆశించారు. అయితే, తనకు హైకమాండ్ టికెట్ ను నిరాకరించడంతో అప్పుడే పార్టీకి గుడ్ బై చెప్పాలని ఆయన భావించారట. కానీ అధిష్టానం రాజమండ్రి ఎంపీ టికెట్ ఇచ్చి బుజ్జగించింది. కానీ ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడు పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో ఇక వేరే పార్టీలో చేరటమే మంచిదని వైసీపీలో చేరడానికి భాస్కరరావు సిద్దమైనట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...