Latest News

ఆస్పత్రిలో మాజీ మంత్రి

posted on: Apr 3, 2015 9:48AM

 

మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. గుండెకు సంబంధించిన సమస్య తలెత్తడంతో ఆయన జూబిలీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చిన ఆయనను పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళం కొంతవరకు పూడుకుపోయినట్టు గుర్తించారు. దాంతో గురువారం యాంజియోప్లాస్టీ చికిత్స చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం రామచంద్రయ్య ఆరోగ్యం నిలకడగా వుందని, ఐసీయు వుంచి చికిత్స అందిస్తున్నామని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...