Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హరీష్ రావును వేధించారు.. ఏడ్పించారు! ఈటల సంచలనం..
posted on: Jun 4, 2021 10:29AM
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. టీఆర్ఎస్ నేతలంతా అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తాను ఐదేండ్లుగా అవమానాలు భరిస్తూ వచ్చానన్నారు. మంత్రిగా కూడా తమకు ప్రగతి భవన్ వెళ్లే అవకాశం లేదన్నారు. ఎన్నోసార్లు సీఎంను కలవడానికి వెళ్లి... అపాయింట్ మెంట్ రాకపోవడంతో తిరిగొచ్చామని తెలిపారు. బానిసగా ఉన్న మంత్రి పదవి ఎందుకని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆగం కావద్దనే అవమానాలను భరిస్తూ వచ్చానని చెప్పారు ఈటల రాజేందర్.
తననే కాదు హరీష్ రావును కేసీఆర్ కుటుంబం వేధించిందన్నారు ఈటల రాజేందర్. ఎన్నోసార్లు హరీష్ రావు తన ముందు ఏడ్చారని చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు సైలెంటుగా ఉన్న.. అతని కుటుంబ సభ్యులకు జరిగిందంతా తెలుసన్నారు. ప్రగతి భవన్ కాదు అది బానిస్ భవన్ అన్నారు రాజేందర్. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారి కూడా లేరన్నారు. వైద్యశాఖ మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తారా అని రాజేందర్ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కారు సింబల్ పై గెలిచిన హుజూరాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ పై యుద్ధం ప్రకటించారు ఈటల రాజేందర్. అనామకుడు లేఖ రాస్తే మంత్రిపై విచారణ జరిపిస్తారా అని ఈటల ప్రశ్నించారు. ఉరి శిక్ష పడిన ఖైదీని కూడా చివరి కోరిక అడుగుతురాని.. కాని తనను మాత్రం కనీసం వివరణ కూడా అడగకుండానే మంత్రివర్గం నుంచి తొలగించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజల మద్దతు తనకు ఉందన్నారు.




