భీమవరం బుల్లోడి సరసన ఎస్తర్‌

 

   తెలుగులో కొత్త హీరోయిన్లకు మంచి ఆదరణ లభిస్తుంది. తొలి సినిమా కాస్త సక్సెస్ అయితే చాలు ఇక ఆఫర్లు వరుస బెడుతున్నాయి.  ఈ లిస్ట్‌లో ఇప్పుడు మరో అందాల భామ చేరిపోయింది. కొత్త వారితో సంచలనా సృష్టించే తేజ డైరెక్షన్‌లో పరిచయం అయిన ఆ బ్యూటి ఎస్తర్‌.
    తెలుగు లో కొత్తగా వస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.తెలుగు ప్రేక్షకుల హృదయం చాలా విశాలమైనది కాబట్టి ఎంతమంది వచ్చిన వారిలో టాలెంట్ ఉంటే చాలు వారిని ఒక ఎత్తుకు తీసుకెళ్తారు సినీ అభిమానులు .ఇప్పుడు ఆ క్యాడర్ లోనే వచ్చిన ముద్దుగుమ్మ ఎస్తేర్.
    పేరు విచిత్రంగా ఉన్నా తన యాక్టింగ్‌తొ పాటుతో అందరిని కట్టి పడేసింది ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు తన అభినయంతో కూడా మంచి మార్కులు కొట్టేసిన ఈ భామకు ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయనమాట.
    ఇప్పటికే వెయ్యి అబద్దాలు సినిమాలో నటిస్తున్న ఎస్తర్ తేజ మార్క్ యాక్టింగ్ స్కూల్ నుండి వచ్చింది కాబట్టి ఇక యాక్టింగ్ విషయంలో ఫుల్ ట్రైన్ అయిఉంటుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.
    వేయి అబద్దాలు సినిమాలో ఎస్తర్ యాక్టింగ్ చూసిన సురేష్‌బాబు త్వరలో ఆయన నిర్మిస్తున్న భీవమరం బుల్లోడు సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారట. తొలి సినిమా సక్సెస్‌తోనే సునీల్ సరసన హీరోయిన్‌గా సెలక్ట్ అయిన ఈ భామ ముందు ముందు మరిన్ని ఆఫర్‌తొ బిజీ కానుందట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu