Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇపిఎస్‌కే పట్టం..ఓపిఎస్‌కు ఉద్వాసన
posted on: Jul 11, 2022 4:43PM
తమిళనాట ఏఐఎడిఎంకే రభసకి తెరపడింది. మొత్తానికి ఎడప్పాడి పళనిస్వామి(ఇపిఎస్)కే పార్టీ వర్గాలు పట్టం గట్టాయి. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ రెబెల్ ఓ.పన్నీర్ సెల్వమ్ (ఓపిఎస్)ని పార్టీ నుంచి బహిష్కరించారు. అన్నా డిఎంకె జనరల్ కౌన్సిల్ పార్టీ కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులను రద్దుచేయడంలో సభ్యుల నుంచి వచ్చిన వ్యతిరేకతలను ఎదుర్కొనడంలో సమ స్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. 2,500 మంది సభ్యులున్న కౌన్సిల్ ఎట్టకేలకు ఇపిఎస్‌కు మద్దతు నిచ్చింది.
ఓపిఎస్ పార్టీలోనే వుంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు. ఆయన డిఎంకె కి మద్దతుగా మాట్లాడుతూ పార్టీని బలహీనపరిచేవిధంగా వ్యవహరిస్తున్నారని ఏఐఎడిఎంకె పార్టీలో మరికొం దరు సీనియర్ నాయకులూ అభిప్రాయపడ్డారు. కాగా ఈ అభియోగానికి స్పందిస్తూ, అసలు తనను ఇపి ఎస్‌గానీ మరెవ్వరయినా పార్టీ నుంచి తొలగించలేరని, తాను 1.5 కోట్ల పార్టీ కార్యకర్తల మద్దతుతో పార్టీ కో ఆర్డినేటర్ పదవికి ఎన్నికయినవాడినని, తనను ఎలా తొలగిస్తారని పన్నీర్ సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నిగురించి తప్పకుండా కోర్టులో తేల్చుకుంటానన్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక నాలుగు నెలల్లో చేపడతామని సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో నిర్ధా రించారు. పార్టీ ఉన్నతపదవికి పోటీ చేయడానికి నిబంధనల అంశంతో సహా అనేక బై లా లను ఈ సమా వేశంలో సవరించారు. పార్టీలో పదేళ్ల ప్రాధమిక సభ్యత్వం పూర్తిచేసుకున్నవారు పార్టీ పదవులకు పోటీ చేయవచ్చన్నది సవరించిన నిబంధనల్లో ఒకటి స్పష్టం చేసింది. సోమవారం ఉదయం మద్రాసు హై కోర్టు అనుమతి పొందిన తర్వాతనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇపిఎస్ నాయ కత్వంలో ఆయన వర్గం పార్టీ సమావేశం నిర్వహించడాన్ని ఓపిఎస్ కోర్టులో సవాలు చేశారు. కానీ ఆయన పిటిషన్‌ను హై కోర్టు తిరస్కరించింది.
హైకోర్టు తీర్పు రావడానికి ముందు చెన్నైలో సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం వద్ద ఇరుపార్టీల వారు కొట్లాడుకున్నారు, రాళ్లు రువ్వుకున్నారు, వాహనాలు ధ్వంస మయ్యాయి. దీంతో తమిళనాడు రెవెన్యూ శాఖ పార్టీ కార్యాలయానికి తాళాలు వేసింది.
చట్ట ప్రకారం కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ మాత్రమే సమావేశాన్ని ఏర్పాటు చేయగలరని ఓపీఎస్ శిబిరం కోర్టు ముందు వాదించింది. కొత్తగా నియమితులైన ప్రిసీడియం ఛైర్మన్‌చే ఈ సమావేశం సాంకేతి కంగా చట్టవిరుద్ధం. అయితే, జూన్ 23న జరిగిన మునుపటి సమావేశం ఇద్దరు నేతల ఎన్నికను ఆమోదిం చనందున ద్వంద్వ నాయకత్వం అమలులో లేదని, అందువల్ల సమావేశాన్ని ప్రిసీడియం ఛైర్మన్ ఏర్పా టు చేయడం, ఆఫీస్ బేరర్లు ఆహ్వానాలు పంపడం చట్టబద్ధమైనదని టీమ్ ఇపిఎస్ వాదించింది.
గత వారం, చట్టానికి అనుగుణంగా సమావేశాన్ని నిర్వహించేందుకు ఈపీఎస్ బృందానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఇపి ఎస్ ఏక నాయకత్వాన్ని కోరుకుంటుండగా, ఓపిఎస్ ప్రస్తుత ద్వంద్వ నాయకత్వ నమూనాను కొనసాగించాలని కోరుకున్నారు. 2016 డిసెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మర ణించిన తర్వాత ఐదేళ్ల క్రితం కుదిరిన సంధి ప్రకారం ఇద్దరు నేతలు ద్వంద్వ నాయకత్వ నమూనా లో పనిచేస్తున్నారు.






