సాంకేతిక లోపం లేదా? రావ‌త్ హెలికాప్ట‌ర్ క్రాష్‌పై సంచ‌ల‌న రిపోర్ట్‌!

posted on: Jan 5, 2022 3:18PM

సీడీఎస్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిపోవ‌డం మామూలు విష‌యం కాదు. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ప్ర‌తిష్ట‌కే మాయ‌ని మ‌చ్చ‌. ఆర్మీ స‌న్న‌ద్ధ‌త‌, సమ‌ర్థ‌త‌, నిపుణ‌త‌నే ప్ర‌శ్నార్థ‌కం చేసింది ఆ ప్ర‌మాదం. హెలికాప్ట‌ర్ క్రాష్ వెనుక కుట్ర కోణం ఉంద‌నే అనుమాన‌మూ వ్య‌క్తం కావ‌డం మ‌రింత సంచ‌ల‌నం. అందుకే, ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే.. త్రివిధ ద‌ళాల త‌ర‌ఫున‌ అత్యున్న‌త స్థాయి ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా, ఆ ద‌ర్యాప్తు వివ‌రాల‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందించారు. ఆ నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు ఉన్నాయంటూ.. జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ వార్త క‌థ‌నాల ప్ర‌కారం...

జనరల్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో పన్నెండు మంది ప్రయాణించిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్.. తమిళనాడులోని కూనూరు ద‌గ్గ‌ర‌ డిసెంబరు 8న కూలిపోయింది. ఆ దుర్ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాదంపై వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ దర్యాప్తు జరిపింది. ఆ దర్యాప్తు వివ‌రాలను రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించింది. 

హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడానికి సాంకేతిక లోపం కారణం కాదని దర్యాప్తులో వెల్లడైన‌ట్టు 
తెలుస్తోంది. ప్రమాదానికి గురయ్యే ముందు హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోందని.. ఓ రైల్వే లైను గుండా అది వెళ్తోందని.. ఆ సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయని నివేదిక పొందుప‌రిచిన‌ట్టు సమాచారం. 

హెలికాప్ట‌ర్ న‌డిపిన పైల‌ట్‌ అత్యున్నత స్థాయి నిపుణుడ‌ని.. అయితే పరిస్థితిపై సరైన అవగాహన లేకుండా.. పైలట్ నియంత్రణలో హెలికాప్టర్ ఉన్నప్పటికీ, అనుకోకుండా భూమిపైకి దించారని ద‌ర్యాప్తు బృందం తేల్చిన‌ట్టు తెలుస్తోంది. 

అంటే.. ద‌ర్యాప్తు నివేదిక ప్ర‌కారం ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి సాంకేతిక లోపం కార‌ణం కాద‌నే విష‌యంలో మాత్రం క్లారిటీ వ‌చ్చేసింది. నిపుణుడైన పైల‌ట్ హెలికాప్ట‌ర్ న‌డిపినా.. స్థానిక ప‌రిస్థితుల‌పై స‌రైన అంచ‌నా లేక‌, స‌మ‌యానికి స‌రైన నిర్ణ‌యం తీసుకోలేక పోవ‌డం వ‌ల్లే.. సీడీఎస్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలింద‌నే అంచ‌నాకు ద‌ర్యాప్తు బృందం వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...