Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టి20 వరల్డ్ కప్.. సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్.. పాక్ ఇంటికే
posted on: Feb 25, 2026 10:06AM

టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ జట్టు సెమీస్ కు దూసుకెళ్లింది. సూపర్ 8లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 24) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంట్లాండ్ సెమీస్ బెర్త్ ఖాయమైంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగిన మాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా 165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ ను బ్రూక్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. బ్రూక్ కేవలం 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లతో రాణించాడు. సూపర్ 8 లో ఇప్పటికే ఇప్పటికే శ్రీలంకపై విజయం సాధించిన ఇంగ్లండ్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. ఇక ఈ ఓటమితో పాకిస్థాన్ సెమీస్ దారులు మూసుకుపోయాయి.






