ఓజా స్పిన్ మాయ, ఇంగ్లాండ్ ఆలౌట్

posted on: Nov 25, 2012 2:35PM

 

england india, india england, cricket live score, telugu news, telugu latest news

 

నిలకడగా ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ బాట్స్ మెన్లు లంచ్ తరువాత ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కి క్యూకట్టారు. 178 పరుగులతో మూడో రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ధాటిగా ఆటను ప్రారంభించింది. కుక్ 270 బంతుల్లో 122 పరుగులు, పీటర్సన్ 233 బంతుల్లో 186 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఎవరూ బాగా ఆడలేదు. ఇంగ్లాండ్ 413 పరుగులకు ఆలౌట్ అయింది.


భారత్ స్పిన్నర్లు రెచ్చిపోయి ఆరు వికెట్లు తీశారు. ప్రజ్ఞాన్ ఓఝా 5, హర్భజన్ సింగ్ 2, అశ్విన్ రెండు వికెట్లు తీశారు. ప్రయర్‌ను కోహ్లీ బౌలింగ్‌లో ధోనీ రనౌట్ చేశాడు. కీలకమైన కుక్ వికెట్‌ను అశ్విన్, పీటర్సన్ వికెట్‌ను ఓఝా తీశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...