TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంబై టెస్ట్ మ్యాచ్ : ఇంగ్లాండ్ పై చిత్తుగా ఓడిన ఇండియా

Published on: Mon Nov 26, 2012 12:45PM

 

England beat India, England India, england beat india test, england beat india test series

 

స్పిన్ పిచ్, స్పిన్ పిచ్ అని పట్టుబట్టినా ధోనికి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు బంతిని గింగరాలు తిప్పిన పిచ్ పై ఇండియన్ స్పిన్నర్లు ఏమి చేయాలేక నోర్లు వెళ్ళబెట్టారు. తొలి టెస్ట్ పరాజయానికి ఇంగ్లాండ్ మాత్రం గట్టిగా ప్రతికారం తీర్చుకుంది. పది వికెట్ల తేడాతో భారత్ ను చిత్తుగా ఓడించింది. నాలుగు టెస్టుల సిరీస్ ను సమం చేసింది.

 

ఏడు వికెట్లకు 117 పరుగుల వద్ద ఆటను ప్రారంభించిన ఇండియా 142 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 56 పరుగుల ఆధిక్యత లభించింది. గంభీర్ ఒక్కడే కాస్తా నిలబడి 65 పరుగులు చేసి స్వాన్ బౌలింగులో అవుటయ్యాడు. ఇంగ్లాండ్ మాత్రం 56 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేదించింది. ఇంగ్లాండు స్పిన్నర్లు పనేసర్, స్వాన్ ఇండియా బ్యాటింగ్‌ను తుత్తునియలు చేశారు. పనేసర్ ఆరు వికెట్లు తీసుకోగా, మరో స్పిన్నర్ స్వాన్ 4 వికెట్లు పడగొట్టాడు.