ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి
Published on: Sat Nov 16, 2024 5:22PM
.webp)
మావోయిస్టులు మరణించారు. భద్రతా బలగాలలో ఇద్దరు గాయపడ్డారు కంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులోని మాద్ ప్రాంతంలో నక్సల్స్ భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవలి కాలంలో ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కదలికలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి పెట్టడంతో తరచూ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సైన్యం, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.


