Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...23.29శాతం పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం.. జగన్‌పై ఉద్యోగుల ఆగ్రహం
posted on: Jan 7, 2022 4:01PM
అనుకున్నట్టే అయింది. ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. ఉద్యోగులు కొండంత అడిగితే.. జగనన్న గోరంత ఇచ్చి సరిపెట్టారు. కేవలం 23.29శాతం పీఆర్సీ ప్రకటించి ఉసూరు మనిపించారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై అప్పుడే ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మేం అడిగిందెంత? మీరు ఇచ్చిందెంత? అంటూ మండిపడుతున్నాయి. కనీసం 47శాతం అయినా ఇవ్వమంటే.. అందులో సగం కూడా ఇవ్వకుండా మమ అనిపించింది సర్కారు. మరి, మిగతా 71 డిమాండ్ల సంగతేంటంటూ నిలదీస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.
కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంది. 23.29 శాతం పీఆర్‌సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర 71 డిమాండ్ల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఆ సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్‌సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. 23.29 శాతం పీఆర్సీ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురి చేశారు.
ఫిట్‌మెంట్ విషయంలో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పీఆర్‌సీలో ఫిట్‌మెంట్ 23 శాతంగానే ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పటికే 27 శాతం ఐఆర్ తీసుకుంటున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ఏపీ ఉద్యోగులు ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ తీసుకోనున్నారు. అయితే 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్ధిక ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం మెలికపెట్టింది. కొత్త జీతాలు 2022 జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
భుత్వం హెచ్‌ఆర్‌ఏ ఊసెత్తలేదు. హెచ్‌ఆర్‌ఏ తగ్గించాలని ఇప్పటికే సీఎస్ కమిటి సిఫార్స్ చేయగా.. దానిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ విషయం ప్రస్తావించకుండా దాటవేసింది ప్రభుత్వం. సీసీఏ (సిటి కాంపెన్సేటరి ఎలవెన్స్) గురించి కూడా స్పష్టత ఇవ్వలేదు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు అడిషనల్ క్వాంటం పెన్షన్‌పై క్లారిటీ లేదు.


.webp)
.webp)


