బాపు కన్నుమూత
posted on: Aug 31, 2014 5:41PM
.jpg)
ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఐదు నంది అవార్డులు అందుకున్నారు. డిసెంబర్ 15 తేది 1933లో పశ్చిమ గోదావరి జిల్లాలో బాపు జన్నించారు. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆంధ్రపత్రికలో ఆయన కార్టూనిస్తుగా కెరీర్ ప్రారంభించారు.ఆయన ప్రాణ మిత్రుడు, రచయిత ముళ్ళపూడి వెంకట రమణ ఇటీవల కన్నుమూశారు. బాపు దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’.



.jpg)


