నెల్లూరు, ఏలూరు మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్!

posted on: Feb 17, 2026 9:38AM

నెల్లూరు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

నెల్లూరు మేయర్ విషయంలో అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ మాజీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఆందోళనకు దిగారు.  అయితే జయవర్ధన్ ఆరోపణలను తెలుగుదేశం ఖండించింది.  వైసీపీ ప్రోత్సాహంతోనే తమపై విషప్రచారం సాగించారనితెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ అసత్య  ప్రచారాలు చేశారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకే సంఖ్యా బలం అధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని తెలుగుదేశం ఎంపిక‌ చేసిన విషయం తెలిసిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...