Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ అధికారులను తొలగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు
posted on: Mar 18, 2024 3:24PM
లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. కాదు కుదరదూ అంటే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ హోంశాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొలగించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ మొదటిసారి ఈ చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారుల పైనా ఈసీ వేటు వేసింది. బీఎంసీ కమిషనర్, అదనపు, డిప్యూటీ కమిషనర్లను ఈసీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


.webp)
.webp)


