TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

Published on: Thu Nov 7, 2024 1:13PM

 

మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఈడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. మల్లారెడ్డి విద్యాసంస్థలపై  పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పూలమ్మినా, పాలమ్మినా అంటూ తన ట్రేడ్ మార్క్ డైలాగ్ తో బాగా పాపులర్ అయిన మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై గత ఏడాది జూన్ నెలలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆయన విద్యాసంస్థల నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతోసోదాలు నిర్వహించిన   ఈడీ  ఆ సందర్భంగా కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లనూ కూడా అప్పట్లో ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తాజాగా గురువారం (నవంబర్ 7)న నోటీసులు జారీ చేసింది. అప్పట్లో పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగాలపై ఈడీ మబల్లారెడ్డి వివరణ కో రింది. తాజాగా నోటీసులు జారీ చేసింది.