జనసేనకు ఈసీ షాక్.. నెలాఖరులోగా ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించాలని నోటీసు

posted on: Jul 8, 2022 3:25PM

ఏపీ రాజకీయాలలో చురుకుగా, క్రియాశీలంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ ఈసీ నిబంధనల మేరకు ఆదాయ వ్యయాలను సమర్పించలేదని తేలింది. ఎవరైనా సరే నాకు మద్దతు ఇవ్వాల్సిందే అంటూ ఏపీ రాజకీయాలలో హల్ చల్ చేస్తున్న జనసేన అధినేతకు ఈడీ షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ ఆదాయ వ్యయాలను ఈ నెలాఖరు లోగా సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. ఒక వేళ వాటిని సమర్పించడంలో విఫలమైతే పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఆ నోటీసులో ఈసీ హెచ్చరించింది. అయితే ఇలా నోటీసులు అందుకున్న పార్టీ ఒక్క జనసేన మాత్రమే కాదు.

 తెలుగు రాష్ట్రాలకు చెందిన 119 రాజకీయ పార్టీలకు ఈ నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులు అందుకున్న పార్టీలలో  జనసేనతో పాటు   కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజా శాంతి పార్టీ, తెలంగాణ జన సమితి, లోక్ సత్తా,  తెలంగాణ ఇంటి పార్టీ, నవ తెలంగాణ,  ప్రజా రాజ్యం పార్టీ,  తల్లి తెలంగాణ పార్టీ, సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్,  జై స్వరాజ్, మన తెలంగాణ పార్టీ, జన రాజ్యం పార్టీలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను గతంలోనే కోరిన సంగతి తెలిసిందే.

అయితే ఈసీ వినతిపై కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. అయితే ఈ లోపే ఎన్నికల కమిషన్ ఆదాయ వ్యయాలను సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పార్టీలకు నోటీసులు జారీ చేసి షాక్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా పార్టీ ఆదాయ వ్యయాలను సమర్పించకుంటే ఆయా పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.  ఇన్ కమ్ టాక్స్ ఎగ్జంప్షన్  కోసమే చాలా పార్టీలు రాజకీయ పార్టీలుగా రిజిస్టరు చేసుకుంటున్నాయని ఈసీ భావిస్తోంది.  ఈ క్రమంలోనే ఆదాయ వ్యయ వివరాలు సమర్పించని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. అసలు ఆదాయ పన్ను మినహాయింపు పొందేందుకే కొందరు రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేస్తున్నారనీ, అటువంటి పార్టీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా ఈసీ కోరుతున్న సంగతి తెలిసిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...